Headlines (Telugu)
-
చలసాని కోటేశ్వరరావుకు ఆర్థిక సహాయం
-
ఆర్టీసీ ఉద్యోగుల ఔదార్యం
-
మాజీ డ్రైవర్ కు మద్దతుగా సంఘం స్పందన
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
చలసాని కోటేశ్వరరావుకు నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.అనారోగ్యంతో రెండు కాళ్లు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మణుగూరు డిపో ఆర్టీసీ మాజీ డ్రైవర్ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్.ఎం.యు)మాజీ డిపో నాయకులు చలసాని కోటేశ్వరరావు (సిహెచ్ కే రావు)కు మణుగూరు డిపో ఉద్యోగులు మరియు ఇతర డిపోల స్నేహితులు నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టి ఎం యు)రీజినల్ కార్యదర్శి ఏ. కృష్ణ, సుధాకర్ లు శనివారం నాడు కోటేశ్వరావును ఆయన ఇంటి వద్ద పరామర్శించి సంబంధిత సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ మణుగూరు డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకునిగా అందరికీ సుపరిచితు లైన చలసాని కోటేశ్వరరావు పదవీ విరమణ అనంతం విశ్రాంత జీవితాన్ని అనుభవించాల్సి ఉండగా మధుమేహం వ్యాధి ఆయన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిందని ఫలితంగా పలు శస్త్ర చికిత్సల అనంతరం రెండు కాళ్లు మోకాళ్ళ వరకు తొలగించాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధనకై ఎన్ఎంయు మరియు జేఏసీల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు ఆందోళనలో కోటేశ్వరావు చురుకైన పాత్ర పోషించారని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయు) సంఘాన్ని సుదీర్ఘకాలం నడిపించిన చరిత్ర ఆయనదని, మణుగూరు ఆర్టీసీ డిపోలో కార్మికుల తలలో నాలుకలా అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ధైర్యం నింపిన వ్యక్తి సిహెచ్ కే రావు అని అలాంటి వ్యక్తి రెండు కాళ్లు కోల్పోయి మంచానికి పరిమితం కావటం బాధాకరం అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. అడిగిందే తడువుగా ఆపదలో ఉన్న తోటి మాజీ ఉద్యోగిని ఆదుకోవాలనే తలంపుతో కోటేశ్వరరావు నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.