ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల మొండి వైఖరి విడనాడాలి! డ్రైవర్ల వేతనాలు పెంచాలి

ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల మొండి వైఖరి విడనాడాలి! డ్రైవర్ల వేతనాలు పెంచాలి

*–సిఐటియు డిమాండ్*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 28( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

పార్వతీపురం ఆర్టీసీ డిపో పరిధిలోని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు 2019 నుండి వేతనాలు పెంచలేదని, వేతనాలు పెంపు కోరుతూ ఇప్పటికే కలెక్టర్,ఏసీఎల్, ఆర్టీసీ,అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని అయినప్పటికీ యాజమాన్యాలు జీతాలు పెంపునకు పూర్తిస్థాయిలో అంగీకరించక పోవడం పట్ల ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సంఘం, సిఐటియు నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, సోమవారం జిల్లా రవాణా అధికారి, ఆర్టిసి డిపో మేనేజర్ సమక్షంలో సమస్యలపై, వేతన ఒప్పందం పై సోమవారం చర్చలు జరిపారు. అద్దె బస్సు యాజమాన్యం వేతనాలు పెంచేందుకు పాక్షికంగా కొంత అంగీకరించి నప్పటికీ పూర్తి స్థాయిలో వేతన పెంపునకు అంగీకరించక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు,!

రోజురోజుకు ధరలు పెరుగుతున్నప్పటికీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో డ్రైవరు రోజుకు 12 నుంచి 18 గంటలు విధులు నిర్వహిస్తున్నారని అయినప్పటికీ పనికి తగిన వేతనం చెల్లించటం లేదని అన్నారు. కార్మిక చట్టాలన్నింటిని అమలు చేస్తామని యాజమాన్యాలు ఆర్టీసీ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ ఒప్పందాన్ని అమలు చేయడంలో అద్దె బస్సు యాజమానులు విఫలం అవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వేతన సవరణ చేయాలని, లేనియెడల సమ్మె చేయటానికైనా వెనుకాడమని హెచ్చరించారు.. ఈ రోజు ఆర్టీసీ అధికారులతో జరిగిన చర్చలలో *సిఐటియు జిల్లా కార్యదర్శి బీ వీ రమణ, ఉపాధ్యక్షులు రెడ్డి వేణు, గొర్లి వెంకటరమణ, బంకురు సూరిబాబు అద్దె బస్సు డ్రైవర్ల సంఘం నాయకులు వీరాచారి, దుర్గాప్రసాద్, మన్మధరావు* తదితరులు పాల్గొన్నారు….

Join WhatsApp

Join Now