ఆర్టీసీ సేవలు సమయపాలనతో సాగాలి
కొత్త డిపో మేనేజర్‌కి సూచనలు చేసిన కలెక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 25
కామారెడ్డి ఆర్టీసీ డిపోకు నూతన మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకేను అందజేశారు.
జిల్లాలో ఆర్టీసీ బస్సులు నిర్ణీత సమయానికి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరేలా ప్రణాళికబద్ధంగా నడపాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు, మహిళలు, సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక పర్యవేక్షణ వహించాలని ఆయన నూతన డిపో మేనేజర్‌కి ఆదేశించారు.