నీవు ఎలాంటి అవినీతి, ప్రభుత్వాన్ని చీట్ చేయకుంటే నీకు భయం ఎందుకు ?… మధుసూదన్ రెడ్డి
– సర్వే నెంబర్లు పెట్టి పర్మిషన్ తీసుకో, అసెస్మెంట్ నెంబర్లతో ఎలా తీసుకున్నావు ?
– ఆర్.టి.ఐ అంటే వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహ రెడ్డికి ఎందుకు భయం పుట్టింది?
హైదరాబాద్ :
నీవు నిజంగా భూమిని కొనుగోలు చేసి అది పట్టా భూమి అయితే నువ్వు ఎలాంటి అవినీతికి పాల్పడకుంటే నీకు భయం ఎందుకని, అసెస్మెంట్ నెంబర్లతో పర్మిషన్ ఎందుకు తీసుకున్నావని హయత్ నగర్, వనస్థలిపురం యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం అయినా విలేకరులతో మాట్లాడుతూ 01/03/2024, నేను పాల్వంచ పంచాయతీ కార్యదర్శికి ఆర్టీఐ దాఖలు చేశాను (Acknowledgement No: EN433122539IN). ఈ RTI లో కేవలం గ్రామ సమాచారాన్ని మాత్రమే అడిగాను. దీపికా లేదా నరసింహ రెడ్డి భూమి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
, వీళ్లు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఆర్టీఐ చూసి భయపడి నాపై దాడి చేయించారన్నారు. ఆర్టీఐ అడిగినందుకు దాడి చేయిస్తే నిజంగా భూమి లీగల్ అని నువ్వు నమ్ముతున్నావా జీడిపల్లి నరసింహా ? నా ఇంటిపై దాడి చేయించడంతో జీడిపల్లి నరసింహ రెడ్డి నిజస్వరూపం బయటపడిందన్నారు. తేదీ 07/03/2024 నా ఇంటిపై దాడి, నరసింహ రెడ్డి తన గూండాలతో కలిసి మా ఇంటిపై దాడి చేయించాడు,
బూతులు మాట్లాడి, ఆర్టీఐ వెనక్కి తీసుకోవాలని బెదిరించారన్నారు. మీ అందరినీ చంపేస్తాం అంటూ మా కుటుంబాన్ని భయపెట్టారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10/03/2024, 13/03/2024
తిరిగి వచ్చి డబ్బులు ఇస్తాం, ఆర్టీఐ వెనక్కి తీసుకో అన్నారు. నేను వినకపోతే మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. నా తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో FIR No: 221/2024 నమోదు అయింది. లీగల్ భూమి ఉంటే, మా ఇంటిపై దాడి ఎందుకు చేయించావు జీడిపల్లి నరసింహా ? నా మీద కేసు నమోదు కావడానికి అసలు కారణం నీ అక్రమాలు కదా? 3 సార్లు ప్రజావాణి ఫిర్యాదులు చేయగా జీడిపల్లి నరసింహ రెడ్డి మోసం బయటపడింది అన్నారు.
17/02/2025 – నా ఫిర్యాదులు, నరసింహ రెడ్డి, దీపికా అక్రమంగా ప్రభుత్వ భూమిలో వాణిజ్య భవనాలు కట్టారని ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసాను.
ఫిర్యాదుల నంబర్లు, KMRDC/E/2025/00004 (కామారెడ్డి జిల్లా కలెక్టర్)
TAHPVC/E/2025/00007 (పాల్వంచ తహసిల్దార్)
18/02/2025 – తాసిల్దార్ నివేదికలో ఏముంది?
తాసిల్దార్ నివేదిక ప్రకారం, నరసింహ రెడ్డి, దీపికా సర్వే నెంబర్ 463 లో వాణిజ్య భవనాలు నిర్మించారు. ఈ భూమి ప్రభుత్వ భూమిలోని చెరువు శికం (Tank Bed Area) లో ఉందని అధికారులు తెలిపారు. ఈ భూమి FTL (Full Tank Level) & Buffer Zone లో ఉండే అవకాశం ఉందన్నారు.
ఇది నరసింహ రెడ్డి భూకబ్జాదారుడనే తేల్చేస్తుంది!
ఇక ఎన్ని అబద్ధాలు చెబుతావు?
4. అసెస్మెంట్ నెంబర్ – నీ అక్రమ భవనాలకు ఇదే రుజువు !, లీగల్ భూమికి గ్రామ పంచాయతీ నేరుగా హౌస్ నెంబర్ కేటాయిస్తుంది. కానీ, అక్రమ భవనాలకు మాత్రమే అసెస్మెంట్ నెంబర్ అప్లై చేసుకోవాలి !,
అసెస్మెంట్ నెంబర్: 932 – హౌస్ నెంబర్ 8-19,
అసెస్మెంట్ నెంబర్: 933 – హౌస్ నెంబర్ 8-20,
నీ భూమి నిజమైనదైతే, నేరుగా హౌస్ నెంబర్ ఎందుకు రాలేదు ?, కొత్తగా అసెస్మెంట్ నెంబర్ కోసం అప్లై చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ?, అసెస్మెంట్ నెంబర్ అంటే నీ భవనం లీగల్ గా లేనిదని అర్థం కాదా ?, నీ భూమి నిజమైనదైతే, ఆర్టీఐ అంటే ఎందుకు భయపడుతున్నావ్? నీది లీగల్ భూమి అయితే, మా ఇంటిపై దాడి ఎందుకు చేయించావు ?, తాసిల్దార్ నివేదిక అక్రమ భవనాలు అని చెప్పిందే, దాన్ని ఎలా ఖండిస్తావు ?, నీ భూమి లీగల్ అయితే, అసెస్మెంట్ నెంబర్ కొత్తగా ఎందుకు అప్లై చేసుకున్నావు ?, నీ అక్రమ భవనాలు తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది – ఇంకెన్ని అబద్ధాలు చెబుతావు ?, నీ మోసం బయటపడింది. నువ్వు అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నావని ఎమ్మార్వో నివేదికతో స్పష్టంగా రుజువైంది అన్నారు. ఇకనైనా ప్రజలను మోసం చేయడం ఆపులని ఈ సందర్భంగా నీకు సూచిస్తున్నానని జీడిపల్లి నరసింహారావును అన్నారు.