జిసిసి బంకు నందు ప్రజలకు అందుబాటులో లేనిమచ్చుకైనా కనపడని నిబంధనలు ! సౌకర్యాలు
పన్నుల సైతం వసూలు చేస్తున్న గాలిమర లేక విలవిల
వినియోగదారులు హెచ్చరించిన పట్టించుకోని అధికారులు
ప్రభుత్వ కార్యాలయాలకు నిబంధన నీల్
కాలకృత్యాలు తీర్చుకునే గదులు లేక ఇబ్బందులు
ఇదెక్కడ ఘోరమంటూ విమర్శిస్తున్న అన్నపురెడ్డిపల్లి ప్రజలు
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి /20
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి ,అశ్వరావుపేట ఏజెన్సీ నియోజకవర్గంలోని పలు మండలాలలో ప్రైవేటు సెక్టార్ అయిన జిసిసి సెక్టార్ అయిన ఫిల్లింగ్ స్టేషన్ నందు మచ్చుకైన నిబంధనలు కనపడే పరిస్థితి లేదు కొందరు ప్రైవేటు వ్యక్తులు గాని ప్రభుత్వ సెక్టార్ అయినా( తెలంగాణ గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘం) జిసిసి మేనేజర్లు గాని ఫిల్లింగ్ స్టేషన్లను గాలికే వదిలేసారు అన్నది తేటతెల్లమవుతుంది. వాహన దారుల వద్ద నుండి అన్ని టాక్స్ లు కలిపి పిండేస్తూ కనీసం వసతులు మాత్రం గాలికే వదిలేశారు. ఎన్నోసార్లు వినియోగదారులు హెచ్చరించినప్పటికీ పట్టించుకున్న పాపాన లేదు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకున్న పాపాన లేదు. కనీసం వాహనదారులకు కాలకృత్యాలు తీర్చుకునే గదులు సైతం కొన్ని ప్రదేశాలలో మచ్చుకైన కనబడిన సందర్భం లేదు. ప్రభుత్వ సెక్టార్ అయినప్పటికీ వాటిలో పనిచేసే ప్రైవేట్ వ్యక్తులు మాత్రం తమ సొంత ఖాతాలోకి వినియోగదారుల నుండి ధనాన్ని పొందుతున్నారు. నేటికీ అటువంటి ఫీలింగ్ స్టేషన్ నందు యూనికోడ్ వంట సదుపాయం లేకుండా పోవడం గమనార్హం పట్టించుకోవాల్సిన జిసిసి అధికారులు కళ్ళు ఉన్న మూసుకొని వారు విధులుగా హాజరవుతున్నారే తప్ప ఫిల్లింగ్ స్టేషన్ లో వాహనదారులకు అసౌకర్యాలను కలిగించకుండా ఉండేందుకు తగు చర్యలు చూసిన దాఖలాలు లేవు. అశ్వరావుపేట నియోజకవర్గం లోని దమ్మపేట పట్టణంలోని తెలంగాణ గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘం( బ్రాంచ్ )ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లి పట్టణంలో ఏర్పాటు చేస్తున్న ఫిల్లింగ్ స్టేషన్ నందు కనీస సౌకర్యాలు కనిపించిన పాపాన లేదు. వాహనాలకు వినియోగిస్తున్న గాలి మోటార్ల సైతం తుప్పు పట్టిపోయి ఉన్నప్పటికీ అందించే నాథుడు కరువయ్యాడు. వాహనదారులు కాలకృత్యాలు తీర్చుకునే గదులు నిర్మించిన దాఖలాలు లేవు. రోజుకు వచ్చి లక్షల రూపాయల ఆదాయం ఇచ్చే గిరిజన ఫీలింగ్ స్టేషన్ నందు కనీసం సౌకర్యాలను అధికారులు గాలికి వదిలేసి ప్రేక్షక పాత్రను వహిస్తున్నారు. ఇటువంటి వాటిపై స్థానిక మేనేజర్ సమాచారం కోసం ప్రయత్నం చేసినప్పటికీ వారి దందా ఇంత అంత కాదని తేటతెల్లమవుతుంది. ప్రశ్న ఆ యుధo పలు కథనాలను ప్రచురించిన వారు తీరు మార్చుకునే పరిస్థితి కనిపించట్లేదు అని స్పష్టత కనిపిస్తుంది. ప్రజల వద్ద నుండి అన్ని ప్రభుత్వ పన్నులను కట్టించుకొని వారికి కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో జిసిసి లేదని మండలంలో భారీగా విమర్శలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికైనా వాటిపై ఐ టి డి ఈ . పి ఓ చర్యలు తీసుకొని వినియోగదారులకు అన్ని వసతులు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నపురెడ్డిపల్లి ప్రజలు కోరుతున్నారు కానీ కొందరు అధికారుల వల్ల నిధులు ఉన్నప్పటికీ వినియోగించడంలో అధికారుల నిర్లక్ష్యం పన్నులు చేయించడంలో పై స్థాయి అధికారులు నిర్లక్ష్యం ఆయా మండలంలోని ప్రజలు చేసుకున్న దురదృష్టం అని కొన్ని గిరిజన సంఘాలు అధికారిని తీరా తప్పుపడుతున్నారు . ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అన్నపురెడ్డిపల్లి గిరిజన ఫీలింగ్ స్టేషన్ నందు వాహనదారులకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమం రూపకల్పన చేయాలని అన్నపురెడ్డిపల్లి ప్రజలు కోరుకుంటున్నారు.