కామారెడ్డి హైవేలో రన్నింగ్ లారీ దోపిడి కేసు ఛేదన – మధ్యప్రదేశ్ ముఠా ముగ్గురు అరెస్ట్ 

*కామారెడ్డి హైవేలో రన్నింగ్ లారీ దోపిడి కేసు ఛేదన – మధ్యప్రదేశ్ ముఠా ముగ్గురు అరెస్ట్

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 14

 

గత నెల తేదీ.11.07.2025 నాడు ఉదయం కామారెడ్డి జిల్లా లోని దేవున్పల్లి పోలీసు స్టేషన్ పరిదిలోని, NH-44 రోడ్డుపైన కొందరు వ్యక్తులు బైక్ పై వచ్చి, నిజామాబాదు వైపు వెళ్తున్న రన్నింగ్ లారీ కంటైనర్ లోకి చొరబడి ఫోన్ లు మరియు హెడ్ సెట్ లు దొంగిలించిన విషయమై దేవునిపల్లి పోలీస్ స్టేషన్ నందు (Cr.No.350/2025 U/sec 309(2), 309(4) BNS) నమోదు అయిన ఫిర్యాదు నిమిత్తం ఇట్టి కేసులో S.P. ఉత్తర్వుల మేరకు A.S.P. అట్టీ కేసులను చేధించుటకై 2 స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతంగా చేసి, అట్టి దొంగతనం చేసిన అంతరాష్ట్ర ముఠా లో గల ఐదుగురిలో ముగ్గురిని పట్టుకోవడం జరిగినది. వారిని విచారించగ హైవే రోడ్డుపైన వెళ్తున్న రన్నింగ్ లారీని పరిశీలించి అట్టి లారీని వెనకాలే బైక్ పైన ఫాలో అయ్యి, బైక్ పై లారికి దెగ్గరగా వెళ్లి, కంటైనర్ లారీ యొక్క సీల్ లను కట్టర్ల తో సీల్ కట్ చేసి, లారిలోకి చొరబడి లారిలోని విలువైన మొబైల్స్ మరియు హెడ్ సెట్స్ లను దొంగిలించారు, లారీ డ్రైవర్ లారీ ఆపగా, వెంటనే చాకుతో లారీ డ్రైవర్ ను బెదిరించినారు, ఇదివరకు కూడా దొంగతనం కేసుల్లో చాలా సార్లు జైళ్లకు వెళ్ళి వచ్చారు. హైవే రోడ్డుపైన రన్నింగ్ లారీనలనే టార్గెట్ చేసి అందులోకి చొరబడి అందులో నుండి విలువైన వస్తువులను, మొబైల్ ఫోన్ లను దోచుకుంటున్నట్లుగా ముఠా సభ్యులు వారు చేసిన నేరాన్ని అంగీకరించినారు.అట్టి ముఠా సభ్యుల మధ్యప్రదేశ్ రాష్ట్రం దివాస్ జిల్లాకు చెందిన A1) ప్రదీప్ హుడా , A2) విమల్ సిసోడియా A3) రితిక్ ఝాంజ, తండ్రి: బలరాం ఝాంజ, వయస్సు: 26 సం.రాలు, కులం: కంజర్ భట్ (ST), వృత్తి: కూలీ, నివాసం: ఇంటి.నెం.42, దానిఘటి పోస్ట్, అర్లవాడ, దేవాస్ జిల్లా, మధ్య ప్రదేశ్ రాష్ట్రం, A4) మాల్వియా దీపక్ కుమార్ @ దీపక్ , తండ్రి: రాజారం , వయస్సు: 30 సం.రాలు, కులం: మాల్వియ (SC), వృత్తి: డ్రైవరు నివాసం: ఇంటి నెం.35,వార్డ్ నెం14, అర్నియా , ఫవ్డ ,సుంకోచ్ తాలూకా ,దేవాస్ జిల్లా, మద్యప్రదేశ్ రాష్ట్రం, మరియు A-5 దేవి సింగ్ సిసోడియా , తండ్రి: సలీం సిసోడియా, వయస్సు: 47 సం.రాలు, కులం: కంజర్ భట్ (ST), వృత్తి: కూలీ, నివాసం: ఇంటి.నెం: 37, వార్డ్ నెం.1, బేర కంజర్, పీపల్ రావల్, దేవాస్ జిల్లా, మద్య ప్రదేశ్ రాష్ట్రం అట్టి ముఠా సభ్యులలో ఐదుగురిలోని ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 3 మొబైల్ ఫోన్ లు, 1 బైక్ లు, దాడి చేయడానికి ఉపయోగించే ఒక చాకు మరియు నేరం చేయునపుడు సీల్ కట్ చేసే చిన్న కట్టర్ ఒకటి స్వాధీనపర్చుకొనైనది. అట్టి పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితులను పట్టుకోవడానికి టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగినది.

అరెస్ట్ చేయబడిన నిందుతుల వివరాలు :

A3) రితిక్ ఝాంజ, తండ్రి: బలరాం ఝాంజ, వయస్సు: 26 సం.రాలు, కులం: కంజర్ భట్ (ST), వృత్తి: కూలీ, నివాసం: ఇంటి.నెం.42, దానిఘటి పోస్ట్, అర్లవాడ, దేవాస్ జిల్లా, మధ్య ప్రదేశ్ రాష్ట్రం,

A4)మాల్వియా దీపక్ కుమార్ @ దీపక్ , తండ్రి: రాజారం , వయస్సు: 30 సం.రాలు, కులం: మాల్వియ (SC), వృత్తి: డ్రైవరు నివాసం: ఇంటి నెం.35,వార్డ్ నెం14, అర్నియా , ఫవ్డ ,సుంకోచ్ తాలూకా ,దేవాస్ జిల్లా, మద్యప్రదేశ్ రాష్ట్రం,

A-5) దేవి సింగ్ సిసోడియా , తండ్రి: సలీం సిసోడియా, వయస్సు: 47 సం.రాలు, కులం: కంజర్ భట్ (ST), వృత్తి: కూలీ, నివాసం: ఇంటి.నెం: 37, వార్డ్ నెం.1, బేర కంజర్, పీపల్ రావల్, దేవాస్ జిల్లా, మద్య ప్రదేశ్ రాష్ట్రం.

పరారీలో ఉన్న నిందుతుల వివరాలు: A1) ప్రదీప్ హుడా, A2) విమల్ సిసోడియా

స్వాధీన పరుచుకున్న వస్తువులు: 1. ఒక పల్సర్ బైక్, 2. ఒక చాకు 3. మూడు మొబైల్ ఫోన్స్, 4. ఒక కట్టర్

ఇట్టి కేసు దర్యాప్తులో పాల్గొని హైవే పై దారి దోపిడి కేసులని ఛేదించిన కామారెడ్డి రూరల్ సీ.ఐ. S. రామన్, దేవునిపల్లి ఎస్సై B.రంజిత్ , మాచారెడ్డి SI S.అనిల్, PCs రవికిరణ్, రామస్వామి, అరుణ్, బందగీస CCS సిబ్బంది శ్రీనివాస్, లక్ష్మీకాంత్ మరియు పి‌.ఎస్ సిబ్బందిని కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు అధికారి చైతన్య రెడ్డి, మరియు జిల్లా ఎస్పీ, అభినందించడం జరిగింది.

Join WhatsApp

Join Now