మామూలు ఇస్తేనే కల్లు దుకాణాలు నడిపించుకోండి ?
– కళ్ళు దుకాణాలు, బెల్ట్ షాప్ ల యజమానులను బెదిరిస్తున్న ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ ..?
– కళ్ళు దుకాణదారులకు తలనొప్పిగా మారిన అతని తీరు ..?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి(ప్రశ్న ఆయుధం) జులై 27
కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ తీరు, కళ్ళు దుకాణాల యజమానులకు గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపించుకునే వారికి తలనొప్పిగా మారింది. అతని ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి మామూలు ఇస్తారా, మీ దుకాణాల బంద్ చేసుకుంటారా, అని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
కళ్ళు దుకాణాల యజమానులు తాము చెట్ల నుండి తీసిన కల్లును విక్రయిస్తున్నామని చెప్పినప్పటికీ మీరు ఏ కళ్ళయినా అమ్ముకోండి మాకు మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందే ఈ డబ్బులు నా ఒక్కొక్కరికి కాదు మా డిపార్ట్మెంట్లో చాలామందికి ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు డబ్బులు చెల్లించవలసిందే అంటూ అటు కల్లు దుకాణాలకు, ఇటు బెల్ట్ షాపులకు ఎక్సైజ్ కానిస్టేబుల్ వెళ్లి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అతని బాధ భరించలేక ఓ కళ్ళు దుకాణ యజమాని పత్రిక విలేఖలను సంప్రదించి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు అతనిపై దృష్టి సారించి అతని ఆగడాలను కట్టడి చేయాలని పలువురు గౌడ కులస్తులు కోరుతున్నారు. బెల్ట్ షాపులను అన్ని కులాల వారు నిర్వహిస్తుండగా, కళ్ళు దుకాణాలు మాత్రం కేవలం గౌడ కులస్తులే ఉండడం వారికి ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ వ్యవహారం తలనొప్పిగా మారింది. జిల్లాలో ఎన్నో సంఘటనలు జరిగినా అనంతరం ఎక్కడి వారు అక్కడ తమ జాగ్రత్తలు తీసుకుంటూ తామ కల్లును విక్రయించుకుంటుంటే అలా కాదు మాకు డబ్బులు ఇవ్వాలని అతను ఒత్తిడి చేయడం ఈ గౌడ కులస్తులకు వారికి తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ ఎక్సైజ్ జిల్లా అధికారులను కోరుతున్నారు.