చేయిత్తిన చోట ఆపని
పల్లెవెలుగు బస్సులు:
రిక్వెస్ట్ స్టాప్ సమస్యపై ప్రయాణికుల ఆవేదన
పట్టించుకోని జిల్లా అధికారులు
నిజామాబాద్ జిల్లాలో పల్లెవెలుగు బస్సులు రిక్వెస్ట్ స్టాపుల్లో ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు మార్లు ఆర్టీసీ డిపో మేనేజర్లకు సమస్యను తెలియజేసినా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రత్యేకంగా డిపో 1 మరియు డిపో 2 మేనేజర్ల స్పందన లేకపోవడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆగకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
స్థానికులు, ప్రయాణికులు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారులను తక్షణమే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్య పరిష్కారం కావడం లేదు.బాధ్యత గల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.