Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి జిల్లా జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీగా రుస్తుం విఠల్ రావు నియామకం

IMG 20250712 WA0479

కామారెడ్డి జిల్లా జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీగా రుస్తుం విఠల్ రావు నియామకం 

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామానికి చెందిన రుస్తుం విట్టల్ల్ రావు దిల్సుఖ్నగర్ జూలై 11 శుక్రవారం నాడు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో సంస్థ స్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు మంగళంపల్లి హుస్సేన్ మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలు, విధివిధానాలు, సామాజిక సేవ హక్కుల పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ ఎంపికైన కమిటీ మెంబర్లకు వారి సేవ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కమిటీ సభ్యులకు సమాజసేవలో హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పలు సూచనలు చేశారు. అలాగే సమాజంలో మానవ హక్కుల ఉల్లంఘన లో సంస్థ ఎల్లవేళలా ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండి తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రుస్తుం. విఠల్ రావు ని కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా సంస్థ అధ్యక్షులు నియమిస్తూ నియామక పత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుస్తుం.విఠల్ రావు మాట్లాడుతూ సమాజ సేవలో ప్రతి ఒక్కరికి తన వంతు బాధ్యత నిర్వహిస్తానని సంస్థ పట్ల అంకితభావంతో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో గిరిజ రాణి ఉప్పల్ మహిళా ప్రొటెక్షన్ సెల్ మెంబర్ నాగపూరి. అశ్విని  వినోద్, ఆనంద్, ప్రవీణ్త,దితరులు పాల్గొన్నారు.

Exit mobile version