Headlines
-
రామాయంపేట రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా అవగాహన
-
“జీరో టిల్లేజ్ ద్వారా సమయం, నీరు, ఖర్చు ఆదా”: శాస్త్రవేత్తల సూచన
-
డ్రోన్ల వినియోగం వల్ల సమర్థవంతమైన పురుగు మందుల పిచికారి
-
పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడి సాధ్యం: రైతు నేస్తం
-
ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాస్త్రవేత్తల సూచనలు
రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత నేరుగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రామాయంపేట రైతు వేదిక నందు వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమంలో రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు మండల వ్యవసాయ అధికారులు ఇంచార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్ నారాయణ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఈ వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా మూడు అంశాలపై ప్రధానంగా అవగాహన కల్పించడం జరిగిందని మొదటగా జీరో టిల్లజ్ విధానంలో వరి తర్వాత పొలంలో దున్న కుండానే మొక్కజొన్న వేసే విధానం పైన అవగాహన కల్పించడం జరిగింది ఈ విధానం ద్వారా రైతుకు సమయం నీటిపారుదల మరియు ఖర్చులు కలిసి వస్తాయి రెండో విధానం వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను మినుములు పెసర్లు కంది పొద్దుతిరుగుడు నువ్వులు వంటి స్వల్పకాలిక పంటలు వేసుకోవడం ద్వారా వరి తర్వాత వరిలో వచ్చేటువంటి కలుపు తెగుళ్లు పురుగులు సమర్థవంతంగా అరికట్టవచ్చు అదేవిధంగా ఒక ఎకరం వరి పంట పండించేటువంటి నీటితో రెండున్నర ఎకరాల ఆరుతడి పంటలను పండించవచ్చు ఈ పంటలన్నీ 70-100 రోజులలో పంట కోతకు వచ్చే అవకాశం ఉన్నందున రైతుకు అతి తక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పంట మార్పిడి చేయడం ద్వారా తర్వాత పంటలో పంటల దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఈ అంశాలన్నిటి పైన రైతులకు సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది చివరగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైనటువంటి డ్రోన్ల ద్వారా పురుగు మందులు తెగులు మందులు కలుపు మందులు పిచికారి గూర్చి వివరించడం జరిగింది రోడ్ల వినియోగం ద్వారా రైతు యొక్క సమయం శ్రమ ఖర్చు అయ్యే అవకాశం ఉంది పురుగు మందుల యొక్క వినియోగ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది నూతన సాంకేతిక పరిజ్ఞానం అయినటువంటి రోడ్ల వినియోగంపై రైతులకు కలిగినటువంటి వివిధ సాంకేతిక సందేహాలను సలహాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేయడం జరిగింది. ఇట్లాంటి మరిన్ని రైతుకు సంబంధించిన వ్యవసాయ సంబంధిత సాంకేతిక అంశాలపై ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొని ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని సూచించడం జరిగింది