మెదక్, నర్సాపూర్, జనవరి 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా కమిటీ నూతన సంవత్సరపు క్యాలెండర్ ను అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆవిష్కరించారు. గురువారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా కమిటీ నూతన సంవత్సరపు క్యాలెండర్ ను అడిషనల్ కలెక్టర్ నగేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు రక్షణ సమితి నాయకులు పలు సమస్యలు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నగేష్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు పత్రాల యాదాగౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు అక్కముల మైసయ్య యాదవ్, ఉపాధ్యక్షులు మాచునూరు శ్రీశైలం యాదవ్, అంతంగారి వెంకటేశం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రం బాబా గౌడ్, ప్రధాన కార్యదర్శి షేక్ మదార్, ముఖ్య సలహాదారులు మిరియాల చంద్రశేఖర్ గుప్తా, జిల్లా కార్యదర్శులు చౌడం నరేందర్, బోయిని రమేష్ యాదవ్, సంపత్ యాదవ్, జిల్లా ప్రచార కార్యదర్శి మామిడి నర్సారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కురుమ బేతయ్య, ఎం.నారాయణ, ఎల్లం యాదవ్, రైతులు పాల్గొన్నారు.