త్వరలో ప్రారంభం కానున్న శబరిమల అయ్యప్ప స్వామి..

అయ్యప్ప
Headlines in Telugu
“శబరిమల యాత్రకు సిద్ధం అయ్యింది భక్తుల దర్శనం కోసం అన్నదాన ఏర్పాట్లు”
“శబరిమల అయ్యప్ప యాత్ర భద్రతకు భారీ ఏర్పాట్లు పూర్తి”

-యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 03:

గత ఏడాది శబరిమల యాత్రా సీజన్‌లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వాసవన్ తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ఏడాది శబరిమల యాత్రా సీజన్ లో 13,600 మంది పోలీసులు, 2,500 ఫైర్, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించనున్నారు. అలాగే, టీడీబీ రైల్వే స్టేషన్ల దగ్గర అదనపు పోలీస్ సిబ్బందిని, అటవీ శాఖ 132 సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1500 ఎకో గార్డ్స్ శబరిమలకు వచ్చే భక్తులకు సహాయం చేయనున్నారు. వీటితో పాటు ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కొన్ని రోజుల కిందట పౌర విమానయాన శాఖ రూల్స్ సడలించింది. సెక్యూరిటీ స్కానింగ్ తర్వాత అయ్యప్ప భక్తులు ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించే ఛాన్స్ కల్పించింది.

Join WhatsApp

Join Now