ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ కు నిధులు సమకూర్చాలి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ని కలిసిన సబ్బని వెంకట్
*హుజురాబాద్ డిసెంబర్ 3 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి మీద తన గళం విప్పుతూ అనునిత్యం ప్రజా సమస్యల మీద స్పందిస్తూ తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సబ్బని వెంకట్, ఇటీవల జమ్మికుంట సివిల్ హాస్పిటల్ ను సందర్శించి వసతుల కల్పన, వైద్య నిపుణుల కొరత గురించి వాకబ్ చేసారు. నియోజకవర్గంలో గుండె వైద్య నిపుణుల కొరత, ఆవశ్యకత గురించి తెలుసుకుని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. తనతో ఉన్న సన్నిహిత్యం కారణంగా మంత్రి కూడా సానుకూలంగా స్పందించి త్వరలో అధికారులతో మాట్లాడి గుండె వైద్య నిపుణులను నియమిస్తానని హామీ ఇచ్చారని సబ్బని వెంకట్ తెలిపారు.