గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా సభావత్ వినోద్ నాయక్
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 14 , కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాకు చెందిన సభావత్ వినోద్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నూతన ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో బుధవారం గిరిజన విద్యార్థి సంఘం జాతీయ, రాష్ట్ర నూతన కార్యవర్గ ఏర్పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా సభావత్ వినోద్ నాయక్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్, మహాత్మ జ్యోతిబాఫూలే, బాబాసాహెబ్ అంబెడ్కర్ వంటి మహనీయుల స్పూర్తితో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యామని అన్నారు. అదేవిధంగా గిరిజనుల చిరకాల ఆకాంక్ష మా తండాలో మారాజ్యం, మాకంత వాటా అనే డిమాండ్లను లెక్కలేనన్ని నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, అసెంబ్లీ, ప్రగతి భవన్, రాజ్ భవన్, సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాల ద్వారా గత ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేశామని తెలిపారు. తాండలను గ్రామపంచాయతీ లుగా ఏర్పాటు,
గిరిజన రిజర్వేషన్లు 6%నుండి10శాతానికి సాధించుకున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల ఎకరాల పొడుభూముల సమస్యలపై పోరాటం చేసి హక్కుదారిలందరికి పట్టాలు వచ్చే విధంగా ఉద్యమించినామని, కేంద్రప్రభుత్వంపై పోరాడి గిరిజన యూనివర్సిటీ సాధించుకున్నామని, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనుల మీద ఎక్కడ దాడి, హత్యలు, అత్యాచారాలు జరిగినా భాదితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడామన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారిక సెలవుదినంగా ప్రకటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జి.ఓ విడుదల చేసేవిధంగా ప్రయత్నించమని అన్నారు. జి.ఓ నం.33 ద్వారా గిరిజనులకు కల్పించిన 10%రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ యందు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసేందుకు కృషి చేశామని తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గిరిజన విద్యార్థి సంఘం జాతీయ, రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.