ఘనంగా సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు – బీఆర్ఎస్ నాయకుల శుభాకాంక్షలు

*ఘనంగా సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు – బీఆర్ఎస్ నాయకుల శుభాకాంక్షలు*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం మే 5

IMG 20250505 WA2205 శాసనసభ్యురాలు, మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు గండి అంజయ్య గౌడ్, చీర శ్రీశైలం కురుమ, ఎలిజాల సందీప్ గౌడ్, బందెల పరమేష్, కావడి నరసింహ తదితరులు పాల్గొన్నారు. సబితా ఇంద్రారెడ్డికి దీర్ఘాయుష్షు కలగాలని, ఆమె నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు.

ఇటువంటి వేడుకలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. సబితా ఇంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెతో కలిసి ఫోటోలు దిగారు.

Join WhatsApp

Join Now