*తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగం మరువలేనిది*
*సైకిల్ యాత్రలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రచార కార్యదర్శి కుడిది శ్రీనివాస్*
*
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల త్యాగం మరువలేనిదని ఉద్యమకారులను గుర్తించినప్పుడే ఏ ప్రభుత్వం అయినా మనుగడను సాగిస్తుందని అలాగే తెలంగాణ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి ఆరు గ్యారంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశం చేర్చి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉద్యమ ఫోరం ప్రచార కార్యదర్శి కుడిది శ్రీనివాస్ అన్నారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వానికి శక్తిని అందించాలని టియుఎఫ్ ప్రచార కార్యదర్శి కుడిది శ్రీనివాస్ పటేల్ 41 రోజుల అయ్యప్ప దీక్షలో 41 దేవాలయాల దర్శనం సైకిల్ యాత్ర ద్వారా దర్శన కార్యక్రమం చేపట్టడం జరిగిందని గురువారం రోజున ఇల్లందకుంట మండలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయానికి దర్శనానికి సైకిల్ యాత్ర ద్వారా రాగ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్, హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు ఉకంటి మల్లాచారి, ఇల్లందకుంట మండల అధ్యక్షుడు రాజబాబు పాల్గొని శ్రీనివాస్ కి పూలమాలతో శాలువాలతో సత్కరించారు తన సైకిల్ యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు ఉద్యమకారుల హామీలు ప్రభుత్వం నెరవేర్చందుకు సానుకూలంగా ఉందని త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టియుఎఫ్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్, హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు ఉకంటి మల్లాచారి, ఇల్లందకుంట మండల అధ్యక్షులు రాజబాబు, రాజీరు నాయకులు కారింగుల రాజేందర్, గైకోటి రాజు, కుమారస్వామి, బుడిగె శ్రీకాంత్, బిజిగిరి శ్రీకాంత్, అరుణ్ రెడ్డి, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.