గోకుల్ సేన ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం

గోకుల్ సేన ఆధ్వర్యంలో 10 న సదర్ సమ్మేళనం

ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 08, కామారెడ్డి 

గోకుల్ సేన ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఆదివారం 10 తేదీనాడు సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని యాదవ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా యాదవ సంఘం యువ నాయకుడు కుంభాల లక్ష్మణ్, గోకుల్ సేన నాయకులు మాట్లాడుతూ సదర్ పండగ అనేది పురాతనమైన పండుగ యాదవ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత నిర్వహించుకునే ఒక పండుగని, దీనిని ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంలోని యాదవ సోదరులు నిర్వహించేవారని తెలిపారు. మొదటిసారిగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గోకుల్ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సదర్ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని కావున జిల్లా కేంద్రం నుంచి యాదవ సోదరులు, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని గోకుల్ సేన తరపున కోరడం జరుగుతుందన్నారు. ఈ సమ్మేళనం ఆదివారం సాయంత్రం 5 గంటలకు వీక్లీ మార్కెట్ నుండి ప్రారంభమయి జిల్లా కేంద్రం పలు కూడలి వెంట ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంభాల లక్ష్మణ్ యాదవ్, కన్నబోయిన వెంకటి యాదవ్, భాను యాదవ్, రమేష్ యాదవ్, రాజు యాదవ్, కిరణ్ యాదవ్, శేఖర్ యాదవ్, మురళి యాదవ్, నరేందర్ యాదవ్, రాకేష్ యాదవ్, ప్రకాష్ యాదవ్, రాజేష్ యాదవ్, వంశి యాదవ్, రామ్ యాదవ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now