ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం
ప్రశ్నాయుధం న్యూస్, నవంబర్ 13 , కామారెడ్డి :
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సదరం శిబిరం నిర్వహించారు. దివ్యాంగులకు కేటాయించిన మీ సేవ స్లాట్లలో చాలావరకు స్లాట్లు బుక్ కాలేక చాలామంది ఈ శిబిరానికి రాలేకపోయారు. ప్రతి నెలలో జిల్లాలోని వికలాంగులకు వికలాంగత్వ నిర్ధారణ కొరకు ఏర్పాటు చేయబడు సదరం క్యాంపులో ఏ బి విభాగాలలో దివ్యాంగులకు స్లాట్ లు కేటాయించబడతాయి. దాని ప్రకారం దివ్యాంగులు మీసేవ కేంద్రాలలో సదరం టోకెన్ లు బుక్ చేసుకుని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం శిబిరానికి హాజరవుతారు. ఆర్థోపెడిక్ 112, విహెచ్ 20, ఈఎన్ టి 25, ఎం ఆర్ 15 స్లాట్ లను సోమవారం నుండి శనివారం వరకు టోకెన్ బుక్ చేసుకుని 13వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిఆర్డిఏ కామారెడ్డి జిల్లా తరపున తెలిపారు. కానీ ఆర్థోపెడిక్ విభాగంలో 112 ,ఎం ఆర్ లో 15 స్లాట్ లో బుక్ అవ్వగా ఇఎన్టిలో ఒకటి ,విహెచ్ లో టోకెన్లు ఒక్కటి కూడా బుక్ కాలేవు. దీనివలన జిల్లాలోని దివ్యాంగులు చాలామంది సదర శిబిరానికి హాజరు కాలేకపోయారు. క్యాంపుకు హాజరైన దివ్యాంగులను డాక్టర్లు పరిశీలించారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్,ఈఎన్ టి సర్జన్ డాక్టర్ సంతోష్ కుమార్ , ఆఫ్తాల్మిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ, ఇతర వైద్యుల ఆధ్వర్యంలో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా ఆసుపత్రి ఈఎన్ టి విభాగంలో పిటిఏ, హియరింగ్ సెట్ మిషన్ అందుబాటులో లేకపోవడంతో నిర్ధారణ సరిగ్గా చేయలేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. కావున ఆసుపత్రిలో దివ్యాంగులకు అవసరమైన అన్ని పరికరాలను ఏర్పాటు చేయాలని శిబిరానికి వచ్చిన దివ్యాంగులు కోరారు.