Site icon PRASHNA AYUDHAM

మండలం వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

IMG 20241010 WA0005

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 10 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు వివిధ రూపాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించిన మహిళలు గురువారం చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను తయారుచేసిన మహిళలు గ్రామ చావడిలో ఏర్పాటు చేసి సాంప్రదాయ పాటలు పాడుతూ.. ఆటలు పాడుతూ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండలంలోని నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version