సద్దుల బతుకమ్మ వేడుకలు వర్ణ దేవుని చలువ

*సద్దుల బతుకమ్మ వేడుకలకు వర్ణ దేవుని చలువ*

 

*తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి సద్దుల బతుకమ్మగా సాగనంపు*

 

*ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం అక్టోబర్ 10*

 

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు చేసిన వరుణ దేవుని రాకతో మహిళలు నిరుత్సాహానికి గురయ్యారు వర్ణుడు కరుణించి వర్షం తగ్గుముఖం కావడంతో మహిళలు బయలుదేరి బతుకమ్మ ఘాట్ల వద్ద చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో మునిగారు తొమ్మిది రోజులు బతకమ్మ ఆడి సద్దుల బతుకమ్మగా సాగనంపు చేశారు తీరొక్క పువ్వు కోసం చెట్టు పుట్ట తిరిగి పువ్వులు కోసుకొచ్చి అందమైన బతుకమ్మగా తీర్చిదిద్ది మహిళలందరూ సమూహముగా ఏర్పడి బతుకమ్మను స్తుతించారు ఆడపడుచులు అత్తవారింటి నుండి సొంతింటికి వచ్చి బతుకమ్మ ఆట ఆడడం సంప్రదాయంగా వస్తుంది తెలంగాణ ఆడపడుచులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ పండుగ తీరొక పిండి పదార్థాలు ఇంటిలో చేసుకుని ఇచ్చుకో వాయనం పుచ్చుకో అమ్మ అంటూ ఒకరికొకరు అందజేసుకుంటూ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఇల్లందకుంట మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో ఏర్పాటుచేసిన సద్దుల బతుకమ్మ వద్ద గ్రామపంచాయతీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా తగిన ఏర్పాటు చేసి సజావుగా బతుకమ్మలను నిర్వహించారు

Join WhatsApp

Join Now