జుక్కల్ నియోజకవర్గంలో సద్దుల బతుకమ్మ సంబరాలు

సద్దుల బతుకమ్మ సంబరాలు

 

జుక్కల్ ఆర్సీ అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం 

 

పూలను పూజించే గొప్ప సంస్కృతికి నిలవు తెలంగాణ అని పలువురు తెలియజేశారు. జుక్కల్ నియోజకవర్గం లోని బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరోక్క పూలతో రూపొందించిన ఘనమైన బతుకమ్మలతో ఆడి పాడే సంబరాల్లో ఆఖరి రోజు అయిన సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని నియోజకవర్గంలోని అక్కా చెల్లెలు, చిన్న, పెద్ద అందరూ కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. నియోజకవర్గంలో ఆయా మండలాలలోని, వివిధ గ్రామాలలోని ప్రధాన కూడలిల వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా పలు శాస్త్రీయ, జానపద సంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనంతరం చెరువుల వద్దకు వెళ్లి బతుకమ్మను విడిచిపెట్ట సాగారు.

Join WhatsApp

Join Now