Site icon PRASHNA AYUDHAM

ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ వేడుకలు

IMG 20241011 195121

*ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ వేడుక*

ప్రశ్నయుధం /అక్టోబర్ 11 సిద్దిపేట్ జిల్లా;

 

తెలంగాణ సంప్రదాయం అద్దం పట్టేలా సిద్దిపేట్ అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలో శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా, ఘనం గా సద్దుల బతుకమ్మ పండుగ వేడుక నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు సంతోషంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని నృత్య ప్రదర్శన చేశారు.

గ్రామంలో ప్రతివాడ బతుకమ్మ ఉయ్యాల పాటలతో మారుమోగాయి. ఆడపడుచుల గాజుల శబ్దంలో,చేతుల చప్పట్లతో సద్దుల బతుకమ్మ పండుగ ఘనం శుక్రవారం ముగిసింది.

పొద్దు పొద్దున్నే బతుకమ్మ పూలను తెంపుకొని భక్తీ శ్రద్ధలతో గౌరమ్మా ను పూజించి మల్లీ రావమ్మా గౌరమ్మా అంటూ దగ్గరలో ఉన్న ఊరచేరువు లో బతుకమ్మ ను నిమజ్జనం చేశారు…

*మళ్ళీ రావమ్మా బతుకమ్మ*

 

గ్రామంలోని ప్రతివాడలో ఆడపడుచులు ఆనందోత్సాహాలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

ఆడపడుచుల చప్పట్ల తో ఊరు వాడ మారుమోగింది. ఈ సందర్భంగా ఆడపడుచులు అందరూ మళ్ళీ రావమ్మా బతుకమ్మ అంటూ చెరువులో బతుకమ్మ ను నిమజ్జనం చేశారు.అనంతరం సద్దులల్లో తెచ్చుకున్న ఫలహారం ఒకరికొకరు పంచుకున్నారు…

Exit mobile version