Headlines
-
ప్రభుత్వ ఆసుపత్రుల సుఖ ప్రసవ సేవలపై అవగాహన
-
తల్లి పాల ప్రాముఖ్యతపై చర్చ – ఆరోగ్యం కోసం తల్లుల సంకల్పం
-
పిల్లల పోషణలో తల్లి పాల పాత్ర
-
సుఖ ప్రసవం కోసం ప్రభుత్వ వైద్య సేవల వినియోగం
-
తల్లి పాలతో ఆరోగ్యకరమైన జీవితం – గర్భవతులకు అవసరమైన జాగ్రత్తలు
*హెల్త్ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి*
*జమ్మికుంట డిసెంబర్ 7 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పిట్టలవాడ అంగన్వాడీ కేంద్రంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి గర్భవతులకు ప్రభుత్వ ఆసుపత్రులలోనే సుఖ ప్రసవం పై అవగహన కల్పించినారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందించే సేవలు, వైద్య పరీక్షలు గర్భవతులకు క్లుప్తంగా విరించారు. గర్భవతులు పోషకహారం తీసుకోవాలని, ఐరన్ ఎక్కువగా లభించే ఆకుకూరలు, పండ్లు, బెల్లం పట్టిలు, గ్రుడ్లు, పాలు మొదలగునవి తీసుకోవాలని సూచించారు. గర్భవతులకు పాలిచ్చే తల్లులకు, తల్లి పాల ప్రాముఖ్యత గురించి, తల్లి పాలలో వుండే పోషకాల గురించి అవగాహన కల్పించారు. 6 నెలల వరకు కేవలం తల్లి పాలే ఇవ్వాలన్నారు. ఆ తర్వాత తల్లి పాలతో పాటు అనుబంధ ఆహారం పిల్లలకు ఇవ్వాలన్నారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకి రోగనిరోధక శక్తి పెరుగుతుందని, జబ్బులకు గురికాకుండా ఉంటారని, నీళ్ల విరోచనాలు, న్యూమోనియా వంటి జబ్బులు రాకుండా రక్షింపబడుతారని అన్నారు. తల్లి, బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల, తల్లికి బిడ్డకి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధం పెరుగుతాయని అన్నారు. తల్లి కి రొమ్ము క్యాన్సర్, గర్భషాయ క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయన్నారు. బిడ్డకి బిడ్డకి ఎడం ఉండడం కొరకు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తల్లి పాలు ఇవ్వాలన్నారు.
గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమాన్ని పిల్లలు అన్నప్రాసన కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఎ మోహన్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఆరోగ్య మహిళా కార్యకర్తలు సాజిదా పర్వీన్, రాధా, అంగన్వాడీ టీచర్ కవిత, ఆశాకార్యకర్త సుజాత, ఆయా తిరుమల గర్భవతులు, పాలిచ్చే తల్లులు తదితరులు పాల్గొన్నారు.