జూనియర్ డాక్టర్ పై హత్యాచారం ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో సురక్షిత పని వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది భద్రత కోసం ఔటోపోస్టుల వద్ద భద్రతను పెంచాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. వైద్యులు, సిబ్బందిపై దాడి జరిగితే వెంటనే కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.