సీఎం చంద్రబాబుకు అధునాతన ఫీచర్లతో కొత్త హెలికాఫ్టర్
అమరావతి, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం):
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్ మార్చబడింది.
పాత బెల్ మోడల్ హెలికాప్టర్ స్థానంలో అధునాతన ఎయిర్‌బస్ హెచ్–160 వినియోగం ప్రారంభం.
భద్రతా ప్రమాణాల దృష్ట్యా కొత్త హెలికాప్టర్ వినియోగం.
రెండు వారాలుగా జిల్లాల పర్యటనలకు కొత్త హెలికాప్టర్ వాడుతున్న సీఎం.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుకూలమని నిపుణుల అభిప్రాయం.
భద్రత – సౌకర్యం కోసం ఆధునిక హెలికాప్టర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్ మారింది. ఇంతవరకు వాడుతున్న బెల్ కంపెనీ తయారీ పాత హెలికాప్టర్ స్థానంలో, ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఎయిర్‌బస్ హెచ్–160 మోడల్ హెలికాప్టర్ వినియోగంలోకి వచ్చింది.
సీఎం భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండు వారాలుగా జిల్లాల పర్యటనల కోసం చంద్రబాబు ఈ కొత్త హెలికాప్టర్ ద్వారానే ప్రయాణిస్తున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణం సులభంగా సాగేందుకు అనువుగా ఉండటమే కాకుండా, నూతన సాంకేతిక ఫీచర్లతో కూడి ఉండటంతో ఈ హెలికాప్టర్ ను ఎంపిక చేసినట్లు నిపుణులు వివరించారు.