విద్యార్థుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం
గాంధారి ప్రాంతంలో ఆటోలు, మినీ క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 31
(బుధవారం):
జిల్లాలో ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లు తదితర వాహనాల్లో ప్రయాణిస్తున్న విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు గాంధారి ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి మధుకర్ గుర్తించి సీజ్ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 30 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థుల రాకపోకల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన రవాణా శాఖ, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షిత వాహనాల్లో ప్రయాణిస్తున్నారా అనే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే రహదారి భద్రతా నియమాలను కట్టుబాటుగా పాటిస్తూ, రవాణా శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.