మహిళల భద్రతే షి టీమ్ లక్ష్యం

*మహిళల భద్రతే షి టీమ్ లక్ష్యం..*

*మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడితే కేసులు నమోదు చేస్తాం…*

*షి టీమ్ అధికారి శ్రీలత, పట్టణ సిఐ వరగంటి రవి..*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11*

మహిళల భద్రతే షి టీమ్ లక్ష్యమని మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడిన ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి అండగా షి టీమ్ అందుబాటులో ఉంటుందని విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో షీ టీం అధికారి శ్రీలత పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల కాకతీయ మహిళ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, మహిళల పట్ల ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించ కూడదని అలా చేస్తే వారికి చట్టంలో కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. మహిళలకు అండగా షి టీం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని ఏ సమస్య వచ్చిన స్థానిక పోలీసులకు గాని షీ టీం అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. విద్యార్థి దశ నుండే కష్టంతో కాకుండా ఇష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బంగారు బాటలో ఉంటుందని మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్న మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇప్పటినుండే కష్టపడి చదువుకోవాలని వారికి సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని అంతేకాకుండా సెల్ఫోన్ కు ఎంత దూరంగా ఉంటే అంత భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. సెల్ఫోన్ వాడకం ద్వారా మంచి ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా చెడు ఉంటుందని సెల్ఫోన్ అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు మీకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువులకు స్థానిక పోలీసులకు షీ టీం సభ్యులకు తెలపాలని వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Join WhatsApp

Join Now