శ్రీ సాయి మణికంఠ అపార్ట్మెంట్‌లో ఘనంగా కుంకుమపూజలు
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 29
స్థానిక శ్రీ సాయి మణికంఠ అపార్ట్మెంట్‌లో శుక్రవారం కుంకుమపూజలను ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్‌లోని కుటుంబ సభ్యులంతా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, శ్లోకపఠణం, హారతులుతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ– “అమ్మవారి ఆశీస్సులు, విఘ్నేశ్వరుని కటాక్షం అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అపార్ట్మెంట్‌లో అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషకరం” అని తెలిపారు.