*విశ్వేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవార్లకు సహస్రనామ పారాయణం*
*సమృద్ధిగా వర్షాలు కురవాలని 15 పర్యాయాలు శ్రీ లలితా సహస్రనామం చేసిన భక్తులు*
*జమ్మికుంట జులై 13 ప్రశ్న ఆయుధం*
బోలో శంకరుడు ఆదిమూలుడు అడిగిన వరాలు ఇచ్చే దేవుడు శ్రీ విశ్వేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించిన భక్తులు సకాలంలో వర్షాలు కురవాలని కరువు కాటకాలు దరిచేరకూడదని శ్రీ అన్నపూర్ణ విశాలాక్ష్మి అమ్మ వాళ్లకు 15 పర్యాయాల శ్రీ లలితా సహస్రనామం పారాయణం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గల బొమ్మల గుడి( విశ్వేశ్వర స్వామి ఆలయం)లో అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు భవాని భజన మండలి భక్తులు పారాయణం చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ శర్మ మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కులిసి పాడిపంటలు మెండుగా పండుతాయని విశ్వేశ్వర స్వామి విశాలాక్షి అమ్మవారి ఆశీస్సులతో లోకమంతా సుఖవంతం అవుతుందని తెలిపారు అనంతరం తీర్థ ప్రసాదం వితరణ తద నంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు