పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకుని సింగరేణి ముస్లిం ఉద్యోగులకు సహిరి ఇఫ్తార్

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 4 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి 

సమయాలలో విధుల్లో వెసులుబాటు కల్పించాలి

ఏరియా ప్రాతినిధ్య సంఘం ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి శ్యాంసుందర్కి వినతి పత్రం అందజేత

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో మణుగూరు ఏరియా సింగరేణి ముస్లిం ఉద్యోగులకు డ్యూటీ సమయాలలో ఉదయం ఉపవాస దీక్ష ప్రారంభం సహిరి ముగింపు ఇఫ్తార్ కి విధి నిర్వహణ సమయాలలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ మణుగూరు ఏరియా ప్రాతినిధ్య సంఘం సింగరేణి కాల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి శ్యాంసుందర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి మణుగూరు బ్రాంచ్ ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ నెల అత్యంత ముఖ్యమైన పండుగని ముప్పయి రోజులపాటు నిండు వేసవిలో సైతం నోట్లో చుక్క నీరు త్రాగకుండా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు అత్యంత కఠిన ఉపవాస దీక్ష నిర్వహిస్తారని ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం ఉద్యోగులందరికీ ఉదయం దీక్ష ప్రారంభం సహిరి సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ ఇఫ్తార్ కి డ్యూటీలో ఉన్నవారికి వెసులుబాటు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారని సింగరేణిలో కూడా మత సామరస్యాన్ని గౌరవిస్తూ ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ఏరియా కార్యదర్శి ఎండి షాబుద్దీన్ పలువురు ముస్లిం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now