సాయి మోక్ష హోటల్ కు రూ. 5వేల జరిమానా..

భోజనంలో బోద్దింక ప్రవేట్ హోటల్ నిర్వాకం…

కార్పొరేషన్ కమిషనర్ కు ఫోన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు…

సాయి మోక్ష హోటల్ కు రూ. 5వేల జరిమానా…

IMG 20240825 WA0080

భోజనంలో బొద్దింక వచ్చిన ఘటన నిజా మాబాద్ జిల్లా కేంద్రంలోని హోటల్లో చోటు చేసుకుంది. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్రమైన వాతావ రణంలో ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్లు చెల గాటం ఆడుతున్నాయి. అందులో ఇందూర్ హోటల్స్ రూటే సపరేటు! నగరంలోని ఏకంగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గల సాయి మోక్ష హోటల్లో ఆదివారం భోజనం చేయడానికి వచ్చిన ఓ వినియోగదారుడుకి భోజనంలో ఏకంగా బొద్దింక రావడంతో కంగుతిన్నాడు. ఈ విషయమై వెంటనే కార్పోరేషన్ కమిషనర్ కుఫోన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కమిషనర్ ఆదేశాల మేరకు సానిటరీ ఇన్స్పె క్టర్,మున్సిపల్ అధికారులను మోక్ష హోటల్లో ఆహారాన్ని పరిశీలించారు. ఆహారంలో బొద్దింక ఉంద ని నిర్ధారించిన అనంతరం హోటల్ నిర్వాహకులకు నోటీ సులు ఇవ్వడంతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. హోటల్ పరిసరాలు, ఆహార పదా ర్థాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాల నిల్వ ఉంచిన గిన్నెలపైన మూతలు ఉంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, శుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను అందజేయాలని హెచ్చరించారు. బాధితుడు కేవలం ఫోన్లోనే కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వెనువెంటనే స్పందించి కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now