*ఏపీ కొత్త సీఎస్ గా సాయి ప్రసాద్?*
అమరావతి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియార్టీ జాబితాలో ఐఏఎస్ శ్రీలక్ష్మి టాప్ లో ఉన్నారు. అయితే ఆమెను నియమించడానికి సీఎం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆమె తర్వాత అనంతరాము ఉన్నప్పటికీ సాయిప్రసాద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈయన గతంలో సీబీన్ పేషీలో కార్యదర్శిగా పనిచేశారు.