సాయి ప్రసన్న ను అభినందించిన -అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 06:
SGF జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఇందూర్ బిడ్డ సాయి ప్రసన్న ఎంపిక కావడంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రసన్నను అభినందించారు. అక్టోబర్ 26,27 తేదీలో వికారాబాద్ లో రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో బాలికల విభాగం అండర్ 29 వెయిట్ కేటగిరి లో గోల్డ్ మెడల్ సాధించి. నిజామాబాద్ బోర్గం జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న సాయి ప్రసన్న ఎస్.జి.ఎఫ్ రాష్ట్రస్థాయి టైక్వాండలో ఘనవిజయం సాధించడం గర్వకారం అన్నారు. ఈనెల 7 తేదీ నుండి 12వ తేదీ వరకు మధ్యప్రదేశ్ విదిశ లో జరగబోయే SGF జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై మన జిల్లా క్రీడాకారిణి సాయి ప్రసన్న జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించాలని ప్రతి పిల్లలు చదువుతోపాటు క్రీడాల్లో కూడా రాణించాలని మన తెలంగాణకు మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కోచ్ మనోజ్ కుమార్ ను అభినందించారు సాయి ప్రసన్న తండ్రి గంగాధర్ పాల్గొన్నారు.