*సాయిరెడ్డి టార్గెట్ ఆ ఇద్దరు,* *తెర వెనుక- జగన్ స్పందన..!!*
వైసీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి కామెంట్స్ సంచలనంగా మారాయి.
వైసీపీలో ఈ వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత కొందరు వైసీపీ నేతలు ఇదే తరహా లో వ్యాఖ్యలు చేసారు.
జగన్ కోటరీలో కీలక వ్యక్తులను టార్గెట్ చేసారు. అయితే, ఇప్పుడు జగన్ టీం లో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి సైతం అదే రకమైన వ్యాఖ్యలు చేయటం పార్టీ కేడర్ కు అంతు చిక్కటం లేదు. దీని పైన జగన్ సైతం పార్టీ ముఖ్య నేతలతో చర్చ చేసినట్లు సమా చారం. అసలు సాయిరెడ్డి టార్గెట్ చేసిన జగన్ కోటరీ నేతలెవరు.. సాయిరెడ్డి ఎవరి కోసం ఈ వ్యాఖ్యలు చేసారనేది రాజకీయ చర్చగా మారింది.
*వైసీపీలో కలకలం*
వైసీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి లిక్కర్ స్కాం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ లిక్కర్ స్కాం లో కర్త, కర్మ, క్రియ అని చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయంలో మరింతగా తన వద్ద ఉన్న సమాచారం అవసరమైన సమయంలో ఇస్తానని పేర్కొన్నారు. దీని ద్వారా లిక్కర్ స్కాం జరిగిందనే విధంగా సాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని వైసీపీలో చర్చ జరుగుతోంది. అదే విధంగా కాకినాడ పోర్టు కేసులోనూ సాయిరెడ్డి వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పోర్టు కేసులో అంతా విక్రమ్ రెడ్డి కేంద్రంగా జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ కేసు ల్లో సూత్రధారులు .. పాత్ర ధారులు వారేనని చెప్పటం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన వైసీపీలో చర్చ జరుగుతోంది.
*సాయిరెడ్డి వ్యాఖ్యలతో*
జగన్ కోటరీ కారణంగానే తాను బయటకు వచ్చానని సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ కు తాను చెప్పుడు మాటలు వినవద్దని సూచించానని… జగన్ తనను పార్టీలో కొనసాగమని చెప్పారని సాయి రెడ్డి వెల్లడించారు. తాను మారలేదని.. జగన్ మారారని వ్యాఖ్యానించారు. అయితే, అసలు సాయి రెడ్డి ఇప్పుడు జగన్ కోటరీగా టార్గెట్ చేస్తుంది ఎవరిని అనే చర్చ మొదలైంది. సాయిరెడ్డి ఉత్త రాంధ్ర ఇంచార్జ్ గా ఉన్న సమయంలో ఆయన్ను తప్పించి.. వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్ప గించారు. అదే విధంగా ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా సాయిరెడ్డి ఉండగా.. ఆయన స్థానంలో సుబ్బారెడ్డి ని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సాయిరెడ్డిని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా పరిమితం చేసారు. ఈ నిర్ణయాలు సాయిరెడ్డి మనస్థాపానికి కారణమని పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం.
*వారిద్దరే లక్ష్యంగా*
అదే విధంగా పార్టీలో సజ్జల తోనూ సాయిరెడ్డి కి గ్యాప్ ఉందని ప్రచారం ఉంది. సజ్జల మాటకు జగన్ ప్రాధాన్యత ఇవ్వటం… ముఖ్య నేతలకు కలిసే అవకాశం దక్కలేదని ఎన్నికల ఫలితాల తరువాత పలువురు కీలక నేతలు ఓపెన్ గానే వ్యాఖ్యలు చేసారు. జగన్ కోటరీగా పేరున్న నేతలతో పాటుగా నాడు కీలక స్థానాల్లో ఉన్న అధికారుల పైన పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. సాయిరెడ్డి నాడు వైఎస్సార్, ఆ తరువాత జగన్ కోసం పని చేసారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేంద్రం – వైసీపీ మధ్య సంధాన కర్తగా వ్యవహరించారు. జగన్ కేసుల్లో జైలుకు వెళ్లారు. అలాంటి సాయిరెడ్డి కే కోటరీ కారణంగా జగన్ తో దూరం అయ్యే పరిస్థితి ఏంటని వైసీపీ కేడర్ సోషల్ మీడియాలో పోస్టిం గ్స్ పెడుతున్నారు. కాగా, సాయిరెడ్డి వ్యాఖ్యల పైన కీలక నేతలు స్పందించటం లేదు. మరి సాయి రెడ్డి చెప్పినట్లు జగన్ తన కోటరీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది.