ఆ స్కాంలో చంద్రబాబు హస్తం ఉంది: సజ్జల
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో అవినీతి జరిగిందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని ఈడీ సైతం నిర్థారించిందని అన్నారు. అవినీతి జరిగిందని ఈడీ ఆస్తులను అటాచ్ చేస్తే చంద్రబాబుకు క్లీన్ చీట్ ఇచ్చినట్లు పలు పత్రికలు వార్తలు రాశాయని విమర్శించారు. ఈ స్కాంలో సీఎం చంద్రబాబు హస్తం ఉందని సజ్జల మరోసారి ఆరోపించారు.