సఖి సురక్ష అభియాన్ – ఆరోగ్యమైన విద్యార్థిని, ధైర్యవంతమైన స్త్రీ – బలమైన దేశం కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
ప్రశ్న ఆయుధం ఆగస్టు 25: కూకట్పల్లి ప్రతినిధి
జేన్టీయు దగ్గర ఐ జి ఎన్ ఐ టి ఇ జూనియర్ కాలేజీ లో, ప్రైమ్ 9 సిఇఒ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సఖి సురక్ష అభియాన్ కార్యక్రమంలో అమ్మాయిల ఆరోగ్యం, ఇంటిమేట్ హైజీన్, పిసిఓడి/పిసిఒఎస్ వంటి సమస్యలపై అవగాహన కల్పించబడింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రేమ కుమార్ విద్యార్థినుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ:
• “హైజీన్ అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే ఆత్మవిశ్వాసం. ప్రతి అమ్మాయి తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ‘నా శరీరం – నా సంరక్షణ – నా గౌరవం’ అనేది ప్రతీ ఒక్కరి నినాదం కావాలి” అని సూచించారు.
• పిసిఓడి/పిసిఒఎస్ సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, సమయానికి వైద్య సలహాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పారు.
• “విద్యార్థినుల ఆరోగ్యం అంటే సమాజ శ్రేయస్సు, ఆరోగ్యవంతమైన మహిళ సమాజానికి బలం, దేశానికి శక్తి” అని పిలుపునిచ్చారు.
అలాగే మహిళల కోసం సురక్షిత వాతావరణం, పోషకాహారం, శారీరక వ్యాయామం, రెగ్యులర్ హెల్త్ చెకప్ అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వేముల మహేష్, పోలెబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు తదితరులు పాల్గొని విద్యార్థినులకు ప్రోత్సాహం అందించారు.