రసాయనాలతో మగ్గిన పళ్ళు అమ్మకాలను నిషేదించాలి…!

*రసాయనాలతో మగ్గిన పళ్ళు అమ్మకాలను నిషేదించాలి…!*

*జిల్లాలో విరివిగా రసాయనాలతో మగ్గిన పళ్ళు అమ్మకాలు

*రోగాలకు గురవుతున్న ప్రజలు*

*ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి

*చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 6 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు

మన్యం జిల్లాలో రసాయనాలతో మగ్గిన పళ్ళు అమ్మకాలు నిషేధించాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి పార్వతిపురం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయడు, జిల్లా నాయకులు కోలా కిరణ్ కుమార్, సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ, పార్వతీపురం మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు తదితరులు మాట్లాడుతూ పార్వతీపురం మండలం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ, వీరఘట్టం తదితర పట్టణాలతోపాటు ఆయా మండల కేంద్రాలలో విరివిగా రసాయనాలతో మగ్గించిన పళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయి అన్నారు. రసాయనాలు లేకుండా మగ్గించే పళ్ళు దొరకడం జిల్లాలో కష్టంగా ఉందన్నారు. కార్బెట్ లాంటి ప్రమాదకర రసాయనాలతో కాయల్ని రంగు వచ్చే పళ్ళుగా మగ్గించి అమ్మకాలు చేస్తున్నారన్నారు. సంబంధిత శాఖ అధికారుల తనిఖీలు, నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారన్నారు. ఆయా రసాయనాలతో మగ్గించిన పళ్ళు తిన్న ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయన్నారు. క్యాన్సర్ వంటి భయంకర రోగాలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. అయినప్పటికీ సంబంధించిన శాఖాధికారుల్లో చలనం లేదన్నారు. అరటి పళ్ళు మొదలుకొని యాపిల్, మామిడి తదితర పళ్ళని రసాయనాలతో మగ్గించి మార్కెట్లో యథేచ్ఛగా అమ్మకాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మామిడిపల్లి సీజన్ కావడంతో రసాయనాలతో మగ్గించిన పళ్ళును ప్రజలు తప్పనిసరిగా తినాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మార్కెట్లో ఏ పళ్ళు కొందామన్న రసాయనాలతో తగ్గించినవే ఉంటున్నాయన్నారు. వీటిపై సంబంధిత అధికారులు తప చర్యలు చేపట్టాలని కోరారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు రసాయనాలు మగ్గించిన పళ్ళు తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్లో విరివిగా తనిఖీలు నిర్వహించి, రసాయనాలతో మగ్గించే పళ్ళు అమ్మకాలను జిల్లాలో నిషేధించాలని కోరారు. ఆయా శాఖలకు చెందిన అధికారులు కూడా రసాయనాలతో మగ్గిన పల్లె తినాల్సి వస్తుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమం తన పార్టీ ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు.

Join WhatsApp

Join Now