దేశ నిజమైన లౌకిక చక్రవర్తి టిపూ సుల్తాన్ కు సెల్యూట్
ఆంగ్లేయ వలసపాలకులకు సింహస్వప్నంగా నిల్చిన టిపూ సుల్తాన్ 274వ జయంతి జిల్లా నిజమాబాద్ మోర్తాడ్ మండలంలో పలు సంఘాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా దళిత సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శి జాంబావ చమార్ మాట్లాడుతూ ఉత్తర భారతాన్ని హస్తగతం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, దక్షణ భారతాన్ని ఆక్రమించు కోవటానికి కుట్రలు, కుయుక్తులు పన్నుతున్న సందర్భంగా సామ్రాజ్యవాద శక్తుల రాజ్యవిస్తరణ కాంక్షను బహిర్గతం చేస్తూ భారతీయ స్వదేశీయులను ఏకం కమ్మని పిలుపునిచ్చిన దార్శనికుడు టిపూ సుల్తాన్ అని కొనియాడారు. “ప్రజల సంతోషంలోనే నా సంతోషం. నా ప్రజల సంక్షేమంలోనే నా సంక్షేమం ఇమిడి ఉందని” ప్రకటించి చివరి వరకు ఆ మాటను పాటించిన మానవత్వపు సుల్తాన్. మరోవైపు ఆయనకు మన తెలుగు భాష తోపాటు కన్నడ, మరాఠి, అరబ్బి, పర్షియన్, ఉర్దూ, ఫ్రెంచ్ భాషలను నేర్చుకున్న ఆయన విద్యావ్యాప్తి కోసం అవిరళ కృషి చేశారు. రాజ్య పాలనా వ్యవహారాలలో టిపూ సుల్తాన్ మతాతీతంగా వ్యవహరించారు. మసీదు-మందిరాల మధ్యగాని, హిందూ- ముస్లింల మధ్యగాని ఏమాత్రం తేడా చూపించని నిజమైన లౌకిక చక్రవర్తి అని చమార్ కొనియాడారు. ఇందులో అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వార్ పేట్ లింగన్న, ఆలిండియా ఏ.వై.ఎస్ నాయకులు మామిడి రాజు, గున్నయ్య, అంగుళి మాలజీ, మామిడి గంగవ్వ, ఎం.లక్ష్మి, నల్ల శివరంజని, మమత మాలజీ, మూలనివాసి మాలజీ సుల్తాన్ కు నివాళి అర్పించారు.