కుకునూరుపల్లి మండల బీజేపీ అధ్యక్షునిగా సంపత్ రెడ్డి
* రెండవ సారి పదవి బాధ్యతలు చేపట్టనున్న అనుముల సంపత్ రెడ్డి
*కుకునూరుపల్లి, జనవరి 09,
గజ్వేల్ నియోజకవర్గంలోని కుకునూరుపల్లి మండల బీజేపీ అధ్యక్షుడిగా అనుముల సంపత్ రెడ్డి రెండవసారి నియామకం అయ్యారు. ఈ సందర్బంగా సంపత్ రెడ్డి మాట్లాడుతూ రెండవసారి తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షునిగా నియామకం చేసినందుకు పార్టీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.