బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మసీదు బండ లో మారబోయిన సంపత్ యాదవ్ సంతాప సభ..

*బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మసీదు బండ లో మారబోయిన సంపత్ యాదవ్ సంతాప సభ..*

*ప్రశ్న ఆయుధం,జులై 22, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండ లో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు మారబోయిన సంపత్ యాదవ్ సంతాప సభ కార్యక్రమం ను నిర్వహించారు. బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులు ముందుగా సంపత్ యాదవ్ ఆకస్మిక మృతి పట్ల వారి ఆత్మకు శాంతి చేకూ రాలని సభ్యులు ఒక రెండు నిమిషాలు ఆత్మ శాంతి కోసం పార్టీ కార్యకర్తలతో కలసి మౌనం పాటించారు. అనంతరం సీనియర్ నాయకుడు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కోసం సంపత్ యాదవ్ చాలా కష్టపడ్డాడు , అతనికి ఊహ తెలిసినప్పటినుండి బి ఆర్ ఎస్ పార్టీ కోసమే శ్రమించాడు, ప్రతి ఉద్యమంలో, ముందుండి నడిపేవాడు బి ఆర్ ఎస్ బాపు అయిన కేసీఆర్ కి వీరాభిమాని అతను హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరంగా ఉంది. చాలా చిన్నతనంలోనే అతను చనిపోవడం బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు. అతను మాలో ఒక్కడిలో ఉండేవాడు ఇప్పుడు లేడు అనుకోవడం కూడా చాలా బాధ గా ఉంది. పార్టీ కోసం అతను ఎంత కష్టపడ్డాడో మా పార్టీలోని సభ్యులకు మాత్రమే తెలుసు బయట ఉన్న ప్రజలకు కూడా తెలుసు అని. సంపత్ లేని లోటు ఎవరు తీర్చలేదని ఈ సభ సందర్భంగా తెలియ జేశారు. సంపత్ యాదవ్ ఆత్మకు శాంతికూర్చాలని ఆ భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. సభ్యులు ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాలుగోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment