Site icon PRASHNA AYUDHAM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మాపూర్ లో ఘనంగా సంవిధాన్ దివస్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మాపూర్ లో ఘనంగా సంవిధాన్ దివస్

జగదేవపూర్ నవంబర్ 26 ప్రశ్న ఆయుధం :

భారత రాజ్యాంగం ఆమోదించబడిన సందర్భంలో జరుపుకునే రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మాపూర్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ మాదిరి ఎన్నికలలో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకొని తమని పరిపాలించే నేతను ఎన్నుకోవడం జరిగింది. మేనిఫెస్టో,ఓటు వేసే విధానం,లెక్కింపు, శాంతి భద్రతలు మొదలగు పనులను విద్యార్థులే నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఓటు హక్కు పట్ల మరియు రాజ్యాంగం పట్ల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు ప్రభాకర్, దేవప్రసాద్ నర్సింలు, సుధాకర్, అనురాధ, రామచంద్రం, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version