35వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

35వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలు అందజేత – కమిటీ అధ్యక్షులు మహ్మద్ మునీరుద్దీన్

 కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 35వ వార్డులో పలువురికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు మహ్మద్ మునీరుద్దీన్ ప్రకటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు ఆర్డర్ కాపీలను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బోయిని రజిత, సిరిపురం లావణ్యతో పాటు మరికొందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. పేదలు, నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మహ్మద్ మునీరుద్దీన్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఇందిరమ్మ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కలిగిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment