ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని కలిసిన ఇసుక వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులు

పర్వతనగర్ ప్రాంతాల్లో ఇసుక వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని కలిసి

వారి ఆవేదనను తెలియజేసారు

IMG 20250304 WA0082 scaled

ఆయుధం మార్చి04: కూకట్‌పల్లి ప్రతినిధి

నియోజకవర్గం పరిధిలోని పర్వతనగర్ తదితర ప్రాంతాల్లో ఇసుక వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ని క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా తాము ఇసుక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఏ నాడు కూడా ఎవరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించిందని పోలీసులు రెవెన్యూ అధికారులు వచ్చి మా వాహనాలను ఇసుక కుప్పలను సీజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా వేలాది రూపాయలు ఫైన్ విధిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. న్యాయం చేయాలని కోరుతూ ఈ మేరకు వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇసుక వ్యాపారుల ఆవేదనను అర్థం చేసుకున్న ఏమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు లేక రాసి కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టొద్దని ప్రభుత్వ ఆదేశాలపై ముందుగా ప్రజలకు చిరు వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయం ఉపాధితో బ్రతుకుతున్న ప్రజలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now