ఏ రాష్ట్రాలలోనూ అమలు చేయని కొత్త కొత్త జీవోలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్న జిల్లా అధికారులు..?ఇది నిజమేనా….?

జీవోలను
Headlines 
  1. ఇసుక అక్రమ రవాణా: రాజకీయ నాయకులు, అధికారులు ముడిపడిన వ్యవహారం
  2. పరిపాలనా విధానాలు: ఇసుక కొరత పేరుతో న్యాయపరమైన చర్యలు తప్పిన అధికారులు
  3. ఇసుక మాఫియాకు సహకారం: ప్రజల ఆరోపణలు, రాజకీయ విశ్లేషకుల ఆందోళనలు
  4. ప్రభుత్వ ఆర్థిక స్థితి, ఇసుక దందా: ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పద్ధతులు
  5. ఎజెన్సీ ప్రాంతంలో ఇసుక రవాణా: ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి
  6. పట్టణ ప్రాంతాల్లో ఇసుక విక్రయం: ప్రభుత్వ నియమాలపై ప్రశ్నలు
*ఇంతవరకు ఏ రాష్ట్రాలలోనూ అమలు చేయని కొత్త కొత్త జీవోలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్న జిల్లా అధికారులు… ఇది నిజమేనా….?*

*ప్రభుత్వ అవసరాల మేరకు ఇసుక కొరత పేరుతో స్లిప్పులను ఇచ్చి ఇసుక మాఫియా కు పూర్తిస్థాయి సహకారం అందిస్తున్న కొందరు అధికారులు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి…?*

*రాష్ట్రం అప్పుల లో ఉంటే కొందరు రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం.. ఇసుక అక్రమ దందాతో పేట్రేగిపోతున్న కొందరికి సహాయపడటం ఏ రకంగా న్యాయపరమైనదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు…!*

*ప్రజలకు అండగా నిలబడి హామీలను నెరవేర్చాల్సిన కొందరు నాయకులే న్యాయబద్ధంగా డ్యూటీ నిర్వహించాల్సిన అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తూ… ఓ వర్గానికి మాత్రమే మేలు చేసే పనులకు, సహకారం అందించటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్న స్థానికులు..?*

*న్యాయస్థానాలు, హ్యూమన్ రైట్స్ కమిషన్లు మరియు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లు ప్రస్తుత ప్రభుత్వంలో నిలువ నీడ లేకుండా పోతున్నాయని కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా…! ఇది ఎంతవరకు నిజం…?*

*నాయకుడు చెప్పింది కొంత అయితే… అధికారి పాటించేది ఇంకొంత.. దానిని ఆసరాగా చేసుకొని అర్థరాత్రులు ఇసుక తోలకాలు చేసే వారి అత్యుత్సాహం ఎవరూ ఆపలేనంత… అంటున్న మరికొందరు…!*

*పంచాయతీలను అరకొర నిధులతో నెట్టుకొస్తున్న అధికారులకి, సిబ్బందికి రెవిన్యూ కు మొదటి మెట్టుగా ఉన్న అపరిమితమైన ఇసుకను అలా వృధాగా వదిలేయడంపై ఎన్నో అపోహలు, ఆరోపణలు ప్రజలలో వెల్లువెత్తుతున్నాయి…!*

*ఇసుక ద్వారా రెవెన్యూ ని కాపాడుకొని పంచాయితీ నిధులలో అనుసంధానం చేసి గ్రామాభివృద్ధికి సహకరించాల్సిన కార్యదర్శి గాని, పంచాయితీ అధికారి గాని ఆ శాఖకు సంబందించిన పై అధికారి గానీ అసలు దీని గురించి ఒక్కసారైనా ఆలోచించకపోవడం పై ఒకింత ప్రజలలో నిస్సహాయ స్థితికి కారణం అవుతారా…?*

*స్థానిక ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే… (అది రాజకీయ నాయకులైనా, అధికారులైనా) వారు స్పష్టమైన నివేదికను పై అధికారులకు పంపించి అక్రమంగా తరలిపోతున్న ఇసుకపై రెవెన్యూ ను ఎందుకు సృష్టించలేకపోతున్నారు…?*

*ఏజెన్సీ ప్రాంతాలలో మన ఇసుక మన వాహనం అనేది ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఒక బృహత్తర కార్యక్రమం. దాని ద్వారా అందరికీ ఉపయోగముతో పాటు ప్రభుత్వ సొమ్మును కాపాడిన వారవుతారు… ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు… అని ప్రశ్నిస్తున్న ప్రజలు…*

Join WhatsApp

Join Now

Leave a Comment