Site icon PRASHNA AYUDHAM

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి

ఇసుక
Headlines in Telugu
  1. ఇసుక అక్రమ రవాణాపై టీఆర్ఎస్ నేతల ఆందోళన
  2. భీంగల్ నుంచి యధేచ్ఛగా ఇసుక తరలింపు
  3. ఇసుక అక్రమ రవాణా ఆపలేదని టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
  4. కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  5. ప్రభుత్వ ఆదాయానికి నష్టం: ఇసుక రవాణాపై చర్యలు తీసుకోండి

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని బెజ్జోరా,భీంగల్,బడా భీంగల్ కప్పల వాగు నుండి యదేచ్ఛగా అక్రమంగా ఇసుకను ఆర్మూర్,మామిడిపల్లి, పెర్కిట్,నిజామాబాద్ హైదరాబాద్కు తరలిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. భీంగల్ మరియు బడా భీంగల్ కప్పల వాగుల్లో ప్రభుత్వం ఇసుక తవ్వకానికి అనుమతి ఉన్నది. కానీ బెజ్జోరా గ్రామం నుండి లేదు. అయినా ఈ మూడు ప్రాంతాల నుండి యదేచ్చగా ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. అడ్డుకున్న పౌరులపై గతంలో దాడులు కూడా కాంగ్రెస్ గుండాలు చేయడం జరిగింది. గతంలో 28 మే 2024 రోజున తాసిల్దార్ గారికి భీంగల్ సిఐ గారికి ఇసుక రవాణా ఆపమని వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయినా ఇసుక రవాణా ఆగలేదు. తర్వాత 31 మే 2024 రోజున ఆర్డీవో గారికి ఏసీపి గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయినా అక్రమ రవాణా ఆపలేదు. తర్వాత 19 జూన్ 2024 రోజు నిజామాబాద్ సిపి గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇసుక అక్రమ రవాణాను ఆపాలని వినపత్రం ఇవ్వడం జరిగింది.అయినా ఇసుక రవాణా ఆపలేదు. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ నాయకుల పై తాసిల్దారు గాని పోలీస్ గాని మైనింగ్ అధికారులు కానీ ఏ చర్య తీసుకోవడం లేదు.ఇప్పటికైనా తాసిల్దార్ గాని పోలీసు గానీ మైనింగ్ అధికారులు కానీ కాంగ్రెస్ గుండాలపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలని టిఆర్ఎస్ పార్టీ మండల పక్షాన కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు దొనకటి నర్సయ్య, మాజీ జెడ్పిటిసి చౌటుపల్లి రవి,మాజీ రైతుబంధు అధ్యక్షులు శర్మ నాయక్, మాజీ జిల్లా కోఆప్షన్ మోయీజ్, కౌన్సిలర్లు బోదిరే నర్సయ్య,సతీష్ గౌడ్,రజాక్,తుమ్మ ముత్తెన్న పర్స నవీన్, నాయకులు తుక్కాజి నాయక్, సురేష్, పోతాన్ లింబాద్రి,లడ్డు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version