Site icon PRASHNA AYUDHAM

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల  పేరిట ఇసుక అక్రమ రవాణా

IMG 20250812 WA0574

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల

పేరిట ఇసుక అక్రమ రవాణా

 

 

తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 12

 

• రూ.900/- లకు కొనుగోలు చేసి రూ.9000/- లకు అమ్ముతు ప్రజాధనం దుర్వినియోగం.

• ముగ్గురిపై కేసు నమోదు పరిశోదన ప్రారంభం. సోపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక అవసరం ఉందని MRO తో పర్మిషన్లు తీసుకుని, మంజీరా నది పరివాహక ప్రాంతం హసగుల్, నుండి అదే గ్రామానికి చెందిన మహమ్మద్ ఆదిల్ రు.900 లకు కొని తన ట్రాక్టర్ ద్వారా డ్రైవర్ గోరి, సహాయముతో రవాణా చేస్తూ కర్ణాటక కు చెందిన మదన్ సోపేంద్ర బీరాదకు రు. 9000/- కు అమ్ముతున్నారు. ఇతను అధిక ధరలకు ఇతరులకు అమ్ముతు ప్రజాధానాన్ని దూర్వినియోగం చేస్తు అక్రమంగా ఇసుక రవాణా వ్యాపారం చేస్తున్నారు.జుక్కల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ గోరిని విచారించగ, ఈ ఇసుక అక్రమ రవాణా వ్యాపారం బయటపడింది.

నేరస్తుల పూర్తి వివరాలు.

1) మహమ్మద్ ఆదిల్ 2) గోరి మరియు 3) మదన్ సోపేంద్ర బీరాద, కర్ణాటక ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించనైనది.

Exit mobile version