కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్ ని సన్మానించిన సందన వేణి మహేందర్ యాదవ్ ,

కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్ ని సన్మానించిన సందన వేణి మహేందర్ యాదవ్ , బేరి రామచందర్ యాదవ్

ప్రశ్న ఆయుధం నవంబర్ 26: శేరీలింగంపల్లి ప్రతినిధి 

హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజ్ యాదవ్ ని సన్మానించిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వాటర్స్ సాధనవేణి మహేందర్ యాదవ్ , పల్లగొర్ల మోదీరాందేవ్ 

బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్, పాక స్వామి యాదవ్, ఎడ్ల మహాలింగం యాదవ్, మణికంఠ గౌడ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీల పట్ల జరుగుతుంది అని అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రావలసిన వాటా విద్యా ఉద్యోగం రాజకీయ రంగాల్లో తెలంగాణ కర్ణాటక మరియు భారతదేశవ్యాప్తంగా జనాభా దామాషా పద్ధతిని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటా కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడిన అణగారిన వర్గాలు పోరాడుతున్నారు. వాటా కోసం కేంద్రంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఇంకా అణగారిన వర్గాలకు సరైన వాటా కోసం పోరాడాలని నాగరాజు కి విన్నవించారు. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మా కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్టీ మరియు మైనార్టీలకు వెనుకబడిన అన్ని వర్గాలకు రాహుల్ గాంధీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిసి కులగణన జనగణన చేపట్టి అన్ని వర్గాలకు రాజకీయం విద్యా ఉద్యోగ రంగాల్లో వాటా ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. త్వరలో జరగబోయే సర్పంచి జెడ్పిటిసి ఎలక్షన్లలో బీసీలకు మరియు అన్ని కులాల వారికి దామాషా పద్ధతి తో వాట కల్పించే విధంగా మేము కూడా ప్రభుత్వాన్ని అడిగి అన్ని ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు మరియు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం అధ్యక్షులు మధు యాదవ్, శేరీలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షులు అందేలా సత్యనారాయణ యాదవ్, మైనార్టీ సంఘం ముస్తఫా, అశోక్ ముదిరాజ్, రజక సంఘం కృష్ణ, కుమ్మరి సంఘం దేవేందర్, మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now