సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ నల్గొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కలెక్టర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. గత 19 జూలై 2023న చంద్రశేఖర్ సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయనను నల్గొండ జిల్లా కలెక్టర్‌గా నియమించారు.
సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బదిలీ
Oplus_16908288