సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి శాసన సభల్లో బిల్లు ఆమోదం చేసినందుకు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం సంగారెడ్డిలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమల్లో మైనార్టీలను కలుపుకొని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వలన బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం 46 శాతం ఉన్న బీసీ లకు 42 శాతం ఇచ్చిన పర్వాలేదు కానీ అందులో మైనార్టీలను కలుపుకొని ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. మైనారిటీలకు వేరుగా రిజర్వేషన్ అమలు చేసి ప్రభుత్వం ఇట్టి రిజర్వేషన్ అమల్లో బీసీలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్, రాష్ట్ర నాయకులు కృష్ణయ్య, కృష్ణ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటేశం, జిల్లా బీసీ సంఘం యువజన అధ్యక్షుడు ఎండి జావిద్, కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలు, కరనుజిత్ సింగ్, కుమ్మరి రాములు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, నాయకులు కొండల్, సుదర్శన్ గౌడ్, నారాయణ, సంగమేశ్వర్, పాండురంగం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం చేసినందుకు కృతజ్ఞతలు: సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు
Published On: March 23, 2025 6:52 pm
