*సుమారు రూ 3.5 లక్షల విలువ గల 350 గ్రాముల ఆల్ప్రాజోలం, ఒక బైక్, 4-సెల్ ఫోన్లు సీజ్..*
*పోలీసుల అదుపులో నిందితుడు*
*వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్*
సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): నిషేధిత ఆల్ప్రాజోలం డ్రగ్ అక్రమ రవాణాను అడ్డుకొని సుమారు రూ 3.5 లక్షల విలువ గల 350 గ్రాముల ఆల్ప్రాజోలం, ఒక బైక్, 4-సెల్ ఫోన్లు సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం అందాజ 11 గంటల సమయంలో సీసీయస్, గుమ్మడిదల పోలీసులు గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. గుమ్మడిదల వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న ఒక బైక్ (నెంబర్ లేనిది)ను ఆపి తనిఖీ చేయగా.. అట్టి వ్యక్తి వద్ద 350 గ్రాముల నిషేధిత ఆల్ప్రాజోలం గుర్తించారు. నిందితుని వివరాలు తెలుసుకోగా డోల్లురి సాయిలు అదే గ్రామానికి చెందిన గౌడ సంఘం సొసైటీలో కల్లు డిపోను లీజుకు తీసుకొని కల్లు వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. ఎలాగైనా తప్పుడు మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని అతని చిన్న నాన్న అయినటునవంటి A3- లింగన్నగారి నారాయణమూర్తికి చెప్పగా, నారాయణమూర్తి అతనికి తెలిసిన వ్యక్తి A2- అశోక్ గౌడ్ వ్యక్తి ఆల్ప్రాజోలం అమ్ముతాడని, అట్టి ఆల్ప్రాజోలం మనం కూడా తీసుకొని ఎక్కువ ధరకు అమ్మి, అధిక డబ్బులు సంపాదించవచ్చు అని సాయిలుతో చెప్పి A3- లింగన్నగారి నారాయణమూర్తి, A2- అశోక్ గౌడ్ నుండి 350 గ్రాముల ఆల్ప్రాజోలం తీసుకొని వచ్చి, A1-సాయిలు రాజుకు మంగళవారం ఉదయం అందజ 8 గంటలకు ఇవ్వగా, అట్టి 350 గ్రాముల ఆల్ప్రాజోలంను ఎక్కువ ధరకు అమ్ముకుందామని సాయిలు @ రాజు తన రిజిస్ట్రేషన్ లేని హీరో హోండా గ్లామర్ బైక్ పై హైదరాబాద్ కు బయలుదేరి వెళుతుండగా.. సిసియస్- సంగారెడ్డి, గుమ్మడిదల పోలీసులు గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద అదుపులోనికి తీసుకున్నారు. పై నిందితులు A3-నారాయణమూర్తి, A2- అశోక్ గౌడ్ లను కూడా అదుపులోకి తీసుకొనగా A1- (గుర్తు తెలియని వ్యక్తి నివాసం పటాన్ చెర్వు) పరారీలో ఉన్నాడు. విచారణలో A2- అశోక్ గౌడ్ కు ఒక గుర్తు తెలియని వ్యక్తి A1తో ఫోన్లో పరిచయం ఏర్పడి, ముత్తంగి వద్దకు వచ్చి ఆల్ప్రాజోలం అమ్మి వెళ్ళేవాడని తెలుస్తుందని తెలిపారు. అట్టి ఆల్ప్రాజోలం పౌడర్ విలువ రూపాయలు: 3,50,000/-లు ఉంటుందని, గుమ్మడిదల పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. యువకులు/విద్యార్థులు డ్రగ్స్/గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, వివిధ రకాల నేరాలు చేయడం మరియు ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుందని అన్నారు. ఈ డ్రగ్ మహమ్మారి మత్తులో అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, వారిని నమ్మిన అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు కావున యువత/విద్యార్థులు డ్రగ్స్/గంజాయి బారిన పడవద్దని తెలిపారు. పరిసర ప్రాంతాలలో ఏదైనా అనుమానిత, రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లైతే వెంటనే జిల్లా పోలీసులకు ఎస్-నబ్ నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, సంఘవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో మీ వంతు పాత్ర ఉండాలని ఎస్పీ రూపేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీసీయస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, జిన్నారం ఇన్స్పెక్టర్ నయీముద్దీన్, సీసీయస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.